హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రెవెన్యూ డివిజన్ వెంటనే ఏర్పాటు చేయాలి'

MDK: రామాయంపేట రెవెన్యూ డివిజన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. డివిజన్ ఏర్పడితే పరిపాలనా సేవలు చేరువవుతాయన్నారు. నిర్లక్ష్యం కొనసాగితే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.