హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాలు అడ్డుకోవాలి: కలెక్టర్

MHBD: బాల్యవివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరిష్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో బాల్యవివాహాల సమాచారం అందగానే పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖలు స్పందించి అడ్డుకోవాలన్నారు. బాలికలపై వేధింపులు, దాడుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు రక్షణ కల్పించాలని ఆదేశించారు.