హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడుపాయలలో దీపాలంకరణ

MDK: ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఆలయ ప్రాంగణంలో పాండురంగస్వామి ఆకారంలో అద్భుతంగా దీపాలను అలంకరించి ప్రత్యేక దీపాలంకరణ సేవను నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో ఆకాశదీపాన్ని వెలిగించారు. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లిన ఈ వేడుకను భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వీక్షించి పులకించారు.