హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్డీఎస్‌కు ఒక టీఎంసీ నీరు విడుదల చేయాలి'

MBNR: పంటలు చేతికొచ్చే కీలక సమయంలో నీరు లేక ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్‌కు తక్షణమే ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల పంటలకు చివరి తడులు అందక పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు.