MBNR: జడ్చర్ల మండలం నెక్కొండలో ఉపాధి హామీ పనులు నిలిచిపోవడంతో గత ఐదు వారాలుగా పనులు లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది దుందుభి నది ఉధృతికి చెక్‌డ్యామ్ తెగిపోయి బోర్లు ఎండి పంటలు దెబ్బతిన్నాయని, ఒక్కొక్కరికి అదనంగా 125 పనిదినాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.
తెలంగాణ
ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయి


