హైదరాబాద్: 28°C
వార్తలు

'30 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలి'

GDWL: అయిజ పట్టణంలో పెండింగ్ లో ఉన్న 30 పడకల ఆసుపత్రి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు S.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన 30 పడకల ఆసుపత్రి నిర్మాణం ముందుకు సాగడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పనులు పూర్తి చేయాలని కోరారు.