హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాహుల్ జీ.. ఛాయ్ పీయేంగే ఆవోజీ!

HYD: చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఛాయ్ గ్లాసుల పోస్టర్లు, గతంలో రాహుల్ లైబ్రరీకి వచ్చినప్పటి ఫొటోలతో ప్రదర్శన చేపట్టారు. “రాహుల్ జీ.. ఛాయ్ పీయేంగే ఆవోజీ” అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.