ADB: ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో యువతకు గంజాయి విక్రయిస్తున్న మహారాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన షేక్ కుర్బాన్ ను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ CI సునీల్ కుమార్ బుధవారం తెలిపారు. తక్కువ ధరకు గంజాయి కొని, చిన్న ప్యాకెట్లుగా చేసి గ్రాము రూ.200 చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌లో గంజాయి విక్రేత అరెస్ట్: CI సునీల్ కుమార్


