హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రొఫెసర్ జయశంకర్ ఊరికి మహర్దశ!

HNK: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అక్కంపేట గ్రామ అభివృద్ధి పై బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ చాహత్ వాజ్‌పాయ్, కూడా ఛైర్మన్ సుధారాణి పాల్గొన్నారు.