WNP: కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని 108 అంబులెన్స్ ను కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారి పి. బ్రహ్మానందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో ఉన్న వైద్య పరికరాలు, మందులను పరిశీలించి, అత్యవసర సమయాల్లో వెంటనే మెరుగైన సేవలందించాలని సూచించారు. ప్రజలు 108, గర్భిణులు 102 అమ్మఒడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సకాలంలోనే సేవలు అందాలన్నారు.
తెలంగాణ
108 అంబులెన్స్ తనిఖీ చేసిన అధికారి


