హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ రహదారిపై పశువుల సంచారం.. ప్రమాదాల భయం

SRPT: సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై మోతే మండలం హుస్సేనాబాద్ సమీపంలో గేదెలు, పశువులను రోడ్డుపై వదిలేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో పశువుల కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం కూడా సంభవించింది. అయినా యజమానుల్లో మార్పు రావడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.