హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన పాఠశాలలో కలెక్టర్ అంకిత్ తనిఖీ

BDK: బూర్గంపాడు మండలం, వేపలగడ్డ గిరిజన సంక్షేమ మోడల్ పాఠశాలను కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఇంగ్లీష్, తెలుగు, గణితంలో వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. అక్షరాలు, సంఖ్యలు రాయించి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు. తరగతుల నిర్వహణ, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా విధానంపై ఆరా తీశారు.