హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలి: మంజులామాధవరెడ్డి

NLG: పశువులకు సకాలంలో వైద్యం, పోషకాహారం అందించి పాల ఉత్పత్తిని పెంచుకోవాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజులామాధవరెడ్డి సూచించారు. బుధవారం కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో నిర్వహించిన మెగా పశువైద్య శిబిరాన్ని జిల్లా పశువైద్య శాఖ అధికారి వి.రమేశ్‌తో కలిసి ప్రారంభించారు. శిబిరంలో గేదెలకు మందులు, మినరల్ మిక్చర్ పంపిణీ చేశారు.