హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతోనే అల్పాహార పథకం'

KNR: విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత అల్పాహార పథకాన్ని గంగాధర మధురనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్పంచ్ భాస్కర్ ప్రారంభించారు. పత్తికుంటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనూ కార్యక్రమాన్ని అమలు చేశారు. దూరప్రాంతాల విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు. ఉప సర్పంచ్ తూము రాజ్‌కుమార్ పాల్గొన్నారు.