హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

JGL: 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా జిల్లాలోని ఘాట్లకు వచ్చే భక్తుల కోసం తాత్కాలిక ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇవాళ జరిగిన సమీక్షలో పార్కింగ్, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, భద్రత, వసతి ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, కలెక్టరేట్ AO కిషన్ పాల్గొన్నారు.