MDK: ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉన్నందున యాసంగిలో వరికి బదులు జొన్న, మొక్కజొన్న, కూరగాయల వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏవో ప్రవీణ్ సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కిషన్ తండా, రాయలాపూర్ గ్రామసభల్లో సబ్సిడీ విత్తనాలు, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. నీటిని పొదుపుగా వాడాలన్నారు. ఏఈవోలు సందీప్, సాయికృష్ణ పాల్గొన్నారు.
తెలంగాణ
యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయండి: ఏవో


