హైదరాబాద్: 28°C
తెలంగాణ

29న సత్తుపల్లిలో దీక్షా దివస్ సభ

KMM: కల్లూరులో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ నెల 29న సత్తుపల్లి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ స్థాయి 'దీక్షా దివస్' సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తుఫాన్ బాధిత రైతులను ఆదుకోని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, పార్టీ శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు.