హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLG: నల్గొండ పట్టణంలో రేపు ఉదయం 8 నుంచి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ వేణుగోపాలచార్యులు తెలిపారు. 33 కేవీ లైన్ కింద, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక 11 కేవీ లైన్ మార్పిడి పనుల కారణంగా గొల్లగూడ, రాంనగర్, మిర్యాలగూడ రోడ్డు, ఆర్టీసీ కాలనీ, పద్మావతి కాలనీ, బీజేపీ కార్యాలయం, బస్టాండ్ ప్రాంతం, సతీష్ నగర్‌లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.