MLG: ఈనెల 28న ములుగులోని పీఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాట్లను బుధవారం ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ పరిశీలించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వైద్యులు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
మెగా వైద్య శిబిరం ఏర్పాట్లలో ఎస్పీ


