NRML: బాసర మండలం సావర్గం గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. సర్వే సంబంధిత వివరాలను అధికారులతో వాకబు చేశారు. గ్రామంలో మొత్తం భూముల విస్తీర్ణం,ఇప్పటివరకు చేపట్టిన సర్వే, ఇంకా పూర్తి చేయాల్సిన సర్వే వివరాలను సమీక్షించారు. సర్వే బృందంలోని సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సర్వే ప్రక్రియను చేపట్టాలన్నారు.
తెలంగాణ
'భూముల రీ సర్వేతో భూముల సమస్యలు పరిష్కారం'


