హైదరాబాద్: 28°C
తెలంగాణ

రుణాల పంపిణీ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

KMM: రైతులకు పంట రుణాల పంపిణీని వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి బ్యాంకర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్దేశించిన రూ.5,266 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.2,035 కోట్ల రుణాలు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.