హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

గద్వాల జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో ఏర్పాటు చేసిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' నమోదు శిబిరాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం రోజు ఆకస్మికం గా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వర్ సమస్యలు లేకుండా దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని, అర్హులైన వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియను పరిశీలించారు.