హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పి

MDK: నిజాంపేట మండలం నందిగామ గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ముందుగా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.