హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో ఖేలో ఇండియా క్రీడలు

HYD: డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలు నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవం, గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్టేడియంల అభివృద్ధి, క్రీడాకారుల వసతి, భోజన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. క్రీడల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.