హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌

RR: తెలంగాణ పారిశ్రామిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు రంగారెడ్డి జిల్లా భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నారు. 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ప్రదర్శనలో 1,000కుపైగా సంస్థలు పాల్గొననున్నాయి. రక్షణ, ఔషధ, వ్యవసాయ, విద్య, చేనేత రంగాలకు ప్రత్యేక వేదికలను సిద్ధం చేస్తున్నారు.