హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు పట్టాలు ఇప్పిస్తాం: కాంగ్రెస్

MLG: గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ భూదాన భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. బుధవారం సర్పంచ్ జంపాల ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతులు ఆయనను కలిశారు. వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి సర్వే వివరాలు తెలుసుకున్నారు. 50 శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన సర్వే పూర్తిచేసి అర్హులకు పట్టాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు.