హైదరాబాద్: 28°C
తెలంగాణ

GMR కార్గోలో ఆధునిక నిల్వ వ్యవస్థ

RR: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని GMR కార్గో కేంద్రంలో ఆధునిక నిల్వ వ్యవస్థను ప్రారంభించారు. ఎలివేటెడ్‌ ట్రాన్స్‌ఫర్‌ వెహికల్‌ సాంకేతికతతో అదనపు స్థలం వినియోగించకుండానే ULD నిల్వ సామర్థ్యం 140 శాతానికి పైగా పెరిగింది. దీంతో ఔషధాలు, విలువైన వస్తువులు, అత్యవసర సరుకుల రవాణా వేగవంతం కానుందని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వెల్లడించింది.