హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

జనగామ జిల్లాలో ఈ నెల 27న మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాల భవనం, అత్యవసర వైద్య చికిత్స కేంద్రం ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.