హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారులపై రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు

MDCL: కాప్రా సర్కిల్‌ పరిధిలోని 17వ వార్డులో రహదారి భద్రతకు అధికారులు చర్యలు చేపట్టారు. కేబుల్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి పెద్ద చర్లపల్లి ప్రధాన రహదారిపై, చక్రిపురం నుంచి పెద్ద చర్లపల్లి మార్గంలో ఉప్పల్‌ జోన్‌ ఇంజినీరింగ్‌ విభాగం రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేసింది. వాహనదారులు వేగం తగ్గించి ప్రమాదాలను నివారించేలా ఈ చర్యలు చేపట్టినట్లు జోనల్‌ కమిషనర్‌ రాధిక గుప్తా తెలిపారు.