హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన శ్రీనివాస్

MNCL: బెల్లంపల్లి పట్టణం రాంనగర్ బస్తీకి చెందిన ఆకుల శ్రీనివాస్ గుండెపోటుతో మరణించారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపారు. జనహిత సేవా సమితి సభ్యుల చొరవతో వాసన్ ఐ బ్యాంకు టెక్నీషియన్ చందు బుధవారం కార్నియాను సేకరించారు. శ్రీనివాస్ సేవలను స్మరించుకుంటూ వారిని కొనియాడారు.