హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న ఆలయ గోపురం ధ్వంసంపై బీజేపీ నిరసన దీక్ష

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గర్భాలయ గోపురం ధ్వంసాన్ని నిరసిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆలయం ఎదుట ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పాల్గొని మాట్లాడుతూ.. ఆలయ పవిత్రత, హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను సహించేది లేదన్నారు. ఆలయ అభివృద్ధి పనులపై పారదర్శకత కల్పించాలని డిమాండ్ చేశారు.