హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ట్రాఫిక్‌ భద్రతా పాఠాలు

MDCL: బేగంపేట, బాలానగర్‌లోని టీటీఐలో పాఠశాల విద్యార్థుల కోసం ట్రాఫిక్‌ భద్రతా క్లబ్‌ కార్యక్రమం నిర్వహించారు. తిరుమలగిరి ట్రాఫిక్‌ విభాగం ఏసీపీ ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థులను రహదారి భద్రతా ప్రచారకర్తలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పోలీసులు తెలిపారు.