హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రధాన రహదారిపై ఇదీ పరిస్థితి..!

NRPT: ధన్వాడ మండలం రామకిష్టయ్యపల్లి గ్రామంలోని ప్రధాన రహదారిపై మురుగునీరు పారుతుండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.