HYD: ఆస్మాన్‌గఢ్ డివిజన్‌లో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యాకుత్‌పురా, భవానీనగర్ సెక్షన్లలో విద్యుత్ సరఫరా, బిల్లింగ్ విధానం, బకాయిల వసూళ్లపై అధికారులతో సమీక్షించారు. ప్రతి ఇంటిని సందర్శించి విద్యుత్ సేవల నాణ్యతను పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
ఆస్మాన్‌గఢ్‌లో సీఎండీ ఆకస్మిక తనిఖీలు


