MBNR: జడ్చర్ల మండలంలోని వల్లూరు, ఉదండాపూర్ గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి MLA జనంపల్లి అనిరుధ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి పంచాయతీ భవనాలు కీలకమని అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు గ్రామ పరిపాలనకు ఇవి కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
పంచాయతీ భవనాలకు శంకుస్థాపన


