VKB: అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ స్వామి జాతర వైభవంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా ఈరోజు స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో అనంతగిరి కొండలు మార్మోగాయి. స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు.
తెలంగాణ
అనంతగిరిలో అనంత పద్మనాభుడి జాతర


