హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోక్సో కేసులో 20 ఏళ్ల శిక్ష'

NZB: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగిందన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేటకు చెందిన మాచ్కూరి నారాయణ (53)పై నమోదైన కేసులో నిజామాబాద్ పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించారు.