హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొంగిపొర్లుతున్న కాలువ.. స్థానికులకు ఇక్కట్లు

HYD: యాకుత్‌పురా నియోజకవర్గంలోని భవానీనగర్ తలాబ్‌కట్టా ప్రాంతంలో మురుగునీటి సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాచా గ్యారేజ్ వెనుక ఉన్న ఇంటి నంబర్ 18-7-426/91/A వద్ద గత 15 రోజులుగా మురుగునీటి కాలువ పొంగిపొర్లుతోంది. దీంతో పరిసరాల్లో దుర్వాసన వ్యాపిస్తోంది. జలమండలి అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.