హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు గౌరవం.. భద్రత ముఖ్యం: CP

HYD: మహిళలు భయం లేకుండా, గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉన్నారని HYD పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఇళ్ల నుంచి బహిరంగ ప్రదేశాల వరకు మహిళల పట్ల గౌరవం పాటించాలని పిలుపునిచ్చారు. మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.