హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద కుటుంబాలకు రూ.5 లక్షల భరోసా

RR: బోదునంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ ఎదిరే నాగేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తోందన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న అర్హులందరూ ఆధార్‌తో నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు.