హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలోని SBI బ్రాంచ్ మార్పు

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలోని SBI శాఖను MG రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ బ్రాంచ్‌లో విలీనం చేస్తున్నట్లు బ్యాంకు అధికారులు బుధవారం తెలిపారు. 2027 జనవరి 5 నుంచి ఖాతాదారులకు 15-1-83 చిరునామాలోని కొత్త బ్రాంచ్‌లో సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఖాతాదారులు ఈ మార్పును గమనించాలన్నారు. లావాదేవీల కోసం కొత్త బ్రాంచ్‌ను సంప్రదించాలన్నారు.