వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని రుద్రమదేవి హాల్‌లో ఉమ్మడి జిల్లా అగ్రిగోల్డ్ బాధితుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆరు జిల్లాల బాధితుల కోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అసలు బాండ్లు, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తున్నారు. పత్రాల తనిఖీ అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
తెలంగాణ
కొనసాగుతున్న అగ్రిగోల్డ్ బాధితుల వెరిఫికేషన్


