ASF: 'బేటీ బచావో- బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా అధికారులతో ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత బుధవారం సమీక్ష నిర్వహించారు. బడి మానేసిన బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి పాఠశాలలకు పంపాలన్నారు. బ్యూటీషియన్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో నైపుణ్య శిక్షణ కల్పించాలని, బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. బాలల హెల్ప్‌లైన్ 1098పై అవగాహన కల్పించాలన్నారు.
తెలంగాణ
బేటీ బచావో.. బేటీ పడావో అమలుపై కలెక్టర్ సమీక్ష


