హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారికి వెన్నెముక కండరాల క్షీణత

SDPT: చేర్యాలకు చెందిన 14 నెలల చిన్నారి వెన్నెముక కండరాల క్షీణత (ఎస్ఎంఏ) వ్యాధితో బాధపడుతోంది. నిమ్స్, రెయిన్‌బో ఆస్పత్రుల వైద్యులు వ్యాధిని నిర్ధారించారు. రెండేళ్లలోపు రూ.9 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలని సూచించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు రాజశేఖర్‌రెడ్డి, మౌనిక సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు దాతలు ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.