హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రైబల్ ఫండ్‌తో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

MLG: మంగపేట మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ బండారుగూడెంలో రూ.60 లక్షల ట్రైబల్ ఫండ్‌తో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ జి. సోమయ్య ప్రారంభించారు. మంత్రి సీతక్క సూచనల మేరకు బుధవారం పనులు చేపట్టినట్లు తెలిపారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.