KNR: బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎర్రోజు లక్ష్మణ్ నియమితులయ్యారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావిస్తూ, బీసీ, ఓబీసీ వర్గాల అభ్యున్నతికి, బీజేపీ సిద్ధాంతాల ప్రచారానికి కృషి చేస్తానన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని లక్ష్మణ్ పేర్కొన్నారు.
తెలంగాణ
బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎర్రోజు లక్ష్మణ్


