హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుంటాలలో సర్పంచ్‌కు వీడీసీ అడ్డు

నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామంలో వీడీసీ పేరుతో తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని సర్పంచ్ పెంట దశరథ్ మంగళవారం కుంటాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రోడ్డు పనులు, వీడీసీ బోరు నీటి విషయంలో వీడీసీ అధ్యక్షుడు భరత్ భూషణ్ దుర్భాషలాడారని ఆయన ఆరోపించారు. ఎస్సీ రిజర్వుడు స్థానంలో గెలిచిన తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఎస్సై నరేశ్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు.