హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే అభివృద్ధిపై కేంద్ర మంత్రి దృష్టి

HYD: రైల్వే అభివృద్ధి పనులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రైల్వే అధికారులతో సమీక్షించారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన రైల్వే అభివృద్ధి ప్రణాళికలపై చర్చించినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది.