హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్డీఎస్ రైతులకు తక్షణమే నీరివ్వాలి: శ్రీనివాస్ గౌడ్

MBNR:ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించి, చివరి రెండు తడులకు సాగునీరు అందించాలని కోరారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి రైతుల పంటలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.