హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు లంబాడీ హక్కుల సాధన కోసం LHPS సభ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేపు లంబాడీ హక్కుల పోరాట సంఘం (LHPS) జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి నాయక్ తెలిపారు. సమావేశంలో లంబాడీ హక్కుల పరిరక్షణ, సంఘం బలోపేతం, సామాజిక అభివృద్ధి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. లాంబాడీలు భారీగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.